Pak Player In Sunrisers: సన్‌రైజర్స్ జట్టులో పాకిస్తాన్ ఆటగాడు.. కావ్య మారన్ ఏమన్నారంటే..?

Pak Player In Sunrisers: సన్‌రైజర్స్ జట్టులో పాకిస్తాన్ ఆటగాడు.. కావ్య మారన్ ఏమన్నారంటే..?

Pak Player In Sunrisers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆటగాడిని తమ జట్టులోకి తీసుకుంది. ఏకంగా పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ తో రూ. 2.34 కోట్లతో కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది. ఇంకొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ యాజమాన్యం పాక్ క్రికెటర్ తో ఒప్పందం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్  లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని 1,90,000 ఇంగ్లాండ్ పౌండ్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. 

ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ స్వయంగా అతడ్ని జట్టులోకి తీసుకుంది. అతని ట్రాక్ రికార్డ్ ఆధారంగా భారీ మొత్తాన్ని వెచ్చించ్చింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం- అబ్రార్ అహ్మద్.. సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఆడనున్నాడు. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ కోసం అతన్ని జట్టులో ఆడించనుంది. హండ్రెడ్ లీగ్స్ కోసం ప్రస్తుతం మెగా వేలం పాటలో కావ్యా మారన్ స్వయంగా పాల్గొన్నారు. ఆమెతో పాటు సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కూడా హాజరయ్యారు.

వాస్తవానికి పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరినీ కూడా ఐపీఎల్ టోర్నమెంట్ కోసం తీసుకోవద్దు.. ఈ రూల్ హండ్రెడ్ లీగ్స్ కు మాత్రం వర్తించదు. అందుకే కావ్యా మారన్ ఎలాంటి భేషజాలకూ వెళ్లకుండా అబ్రార్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకుంది. ప్రపంచ టీ20 లీగ్‌లలో పాక్ ప్లేయర్స్ ను తీసుకోకూడనే సంప్రదాయానికి ఆమె తెరదించింది. కాగా అబ్రార్ అహ్మద్ పాకిస్థాన్ తరపున 46 టెస్టులు, 28 వన్డేలు, 52 టీ20లు ఆడగా.. ఇటీవల జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ 8 దశ మ్యాచ్‌లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పాక్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్స్ తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అబ్రార్ కి ఉంది. యూరప్‌లో టీ20 లీగ్‌లో ఆడటం అతడికి ఇదే మొదటి సారి.